బాలకృష్ణకు.. సినిమాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవు !
1 min read

పల్లెవెలుగు వెబ్ : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. సినిమలు తప్ప నియోజకవర్గ సమస్యలపై ఆయన ధ్యాస లేదన్నారు. నియోజకవర్గ ప్రజల గోడు వినిపించేలా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించేలా.. బీఆర్ అంబేద్కర్ ను టీడీపీ నేతలు కోరాలని సూచించారు. ఆరు నెలలకు ఒక్కసారైన ఆయనను నియోజకవర్గానికి తీసుకురాగలరా ? అని ప్రశ్నించారు. సినిమా హిట్ అంటూ భారీ వసూళ్లు వస్తున్నాయని మాట్లాడుతున్న బాలకృష్ణ.. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎమ్మెల్యే విధులు, కర్తవ్యాలు చదివైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

