న్యూ ఇయర్ వేడుకలు వద్దు.. టాస్క్ ఫోర్స్ కమిటీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రరూపం దాల్చనున్న పరిస్థితుల కనిపిస్తుండటంతో కొత్త సంవత్సర వేడుకలు రద్దు చేయాలంటూ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రెండు విడతల కొవిడ్ పరిణామాలకంటే మూడో విడత మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయస్థాయి వైద్యనిపుణులు సూచిస్తున్న వేళ ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. డిసెంబరు, జనవరి మా సాలలో ఆర్థిక వ్యవహారాలు, పండుగలు, సంబరాల పేరిట ఎక్కువమంది చేరడం పెను ముప్పుకు సంకేతమేనని టాస్క్ఫోర్స్ తేల్చింది. వారం రోజుల వ్యవధిలో టాస్క్ఫోర్స్ నాలుగైదుసార్లు భేటీ అయి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించింది. కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పెట్టాలని సమితి ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం