ఒమిక్రాన్ మూలంలో హెచ్ఐవీ !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్, హెచ్ఐవి మూలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనలను ఉటంకిస్తూ ఒమిక్రాన్‌ను హెచ్ఐవితో ముడిపెట్టే అవకాశాలు “అత్యంత ఆమోదయోగ్యమైనదిగా ఉన్నాయని బీబీసీ తన నివేదికలో పేర్కొంది. హెచ్ఐవీ సోకిన మహిళకు కరోనా సోకడం, ఆ తరువాత వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉండే అవకాశాలు ఉండచ్చని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.