NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సంఘాల `కొత్త రాజ‌కీయ పార్టీ` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఏడాది పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేసిన రైతు సంఘాలు రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించాయి. రాబోయే పంజాబ్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని రైతు సంఘాల నాయ‌కులు చెప్పారు. పార్టీ ప్రకటన గురించి శనివారం చండీగఢ్‌లో రైతు సంఘం సీనియర్ నేత బల్బిర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ ‘‘400 భిన్న ఆలోచనా విధానాలున్న సంఘాలు అన్నీ కలిసి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ అనే పార్టీని ఏర్పాటు చేశాయి. రైతుల సమస్యలే ప్రధానంగా ఈ పార్టీ ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపు మా నుంచి ఎప్పుడూ లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ గురించి ఇంకా పూర్తి అవగాహనకు రాలేదు. కానీ వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తాం’’ అని అన్నారు. అయితే.. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించాక రైతు సంఘాలు రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

                        

About Author