`ఆర్ఆర్ఆర్` పై హైకోర్టులో పిల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. అల్లూరి, కొమరమ్ భీం చరిత్ర వక్రీకరించారని హైకోర్టుకెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిల్ దాఖలు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని.. విడుదలపై స్టే విధించాలని కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ పిల్ విచారణకు వచ్చింది. పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది.