గోల్డ్ కు గిరాకీ తగ్గింది !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన మహమ్మారి కారణంగా బంగారానికి గిరాకీ తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణంగా గోల్డ్ కు గిరాకీ అధికంగా ఉంటుంది. కానీ కరోన కారణంగా పెళ్లిళ్ల పై అనిశ్చితి నెలకొంది. దీంతో గోల్డ్ షాపులను సందర్శించే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేటే అన్నారు. మూడో దశ వైరస్ ఉధృతి ప్రభావంతో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం గిరాకీ మళ్లీ మందగించనుందని అన్నారు. అయినప్పటికీ, ఆభరణ వర్తకులు జాగ్రత్తతో కూడిన ఆశాభావంతో ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్చిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడవచ్చని, ఏప్రిల్-మే నెలల్లో వివాహాలు మళ్లీ జోరందుకోవచ్చని ఆయన అన్నారు.