బీజేపీలోకి ములాయం కోడలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్ వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ మంత్రులను ఎస్పీలోకి ఆహ్వానించి .. బీజేపీని ఇరుకున పెడుతున్న అఖిలేశ్ యాదవ్ కు ఇంటిపోరు మొదలైంది. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణాయాదవ్ ఎస్పీకి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీ చేరనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్ధం తీసుకోనున్నారు. అపర్ణా యాదవ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కొద్దికాలంగా ఆమె బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. గతంలో సైతం ఆమె పలుమార్లు నరేంద్ర మోదీ నిర్ణయాలకు బహిరంగంగానే సమర్ధించారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు.