బాటసారులకు ఆసరా.. మర్రిచెట్టు
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: ఆరుగాలం కష్టపడి పని చేస్తున్నా రైతులకు వేసవిలో స్వేద తీర్చుకోవడానికి మర్రి వృక్షం ఎంతో ఉపయోగకరంగా ఉంది. నందికొట్కూరు పట్టణంలో మద్దిగట్ల రస్తా దగ్గరగా ఒక సామాన్య వ్యక్తి మర్రి మొక్కను 1992 సంవత్సరంలో నాటారు. మరి మొక్క శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతోమంది బాటసారులకు, రైతులకు, ఎండా,వాన కలలో నిలిచి ఉండడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. రైతుల బాటసారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీ.శే. కోడుమూరు ఎల్లయ్య కుమారుడు నిమ్మకాయల మోహన్ మర్రిచెట్టు కింద అరుగును, సొంత ఖర్చులతో నిర్మించడంతో బాటసారులు, రైతులు అరుగును నిర్మించిన దాత నిమ్మకాయల మోహన్ ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఏబీఎం చర్చ్ పాస్టర్ రెవె. ఇమ్మానియేల్ పాస్టర్, మరియు సంఘ పెద్దలు మర్రిచెట్టు అరుగుపై, కూర్చొని ప్రత్యేక ప్రార్థనలు విశేషం. అనంతరం దాత అయినటువంటి నిమ్మకాయల మోహన్, పట్టణ నిరాశ్రయులకు, నిరుపేదలకు, విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ కే చిన్న రాజు, 22 వ వార్డు ఇంచార్జి,బొల్లెద్దుల రామకృష్ణ, కుమార్ రాజా, చిన్న నాగరాజు, సన్నీ, బొల్లెద్దుల ఏసన్న, కె.వి.రమణ, ఆర్టు రమణ, సామేలు, జయన్న, సంజన్న, సత్యానందం, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.