మహిళల భద్రతకు… “శక్తి” యాప్
1 min read

శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111
అత్యవసర సమయాల్లో కాల్ చేసినా, మెసేజ్ చేసిన స్పందించేలా వాట్సాప్ నంబర్
జిల్లా వ్యాప్తంగా విద్యార్దులకు, ప్రజలకు శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్ గురించి విస్తృతంగా అవగాహన..
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్, శక్తి వాట్సాప్ ప్రారంభించిందని, మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం పాఠశాలలు, కళాశాలల్లో శక్తి యాప్, శక్తి వాట్సాప్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శక్తి యాప్ యొక్క ఆవశ్యకత ప్రాధాన్యత శక్తి యాప్ ద్వారా అందించే సేవలను విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు పాఠశాలలు ,జూనియర్ కళాశాలల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్ లు, అంగన్వాడీ కేంద్రాలు ఇతర రద్దీ ప్రదేశాలలో, శక్తి టీమ్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణ , భద్రత ఉంటుందని ప్రతి ఒక్కరు శక్తి యాప్ ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శక్తి బృందాలు తెలియజేశారు. “శక్తి” వాట్సప్ నెంబర్… 7993485111.అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసు సేవలను మహిళలకు మరింత చేరువ చేసేందుకు “శక్తి” వాట్సప్ నెంబర్ శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 ను మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తేవడం జరిగిందని తెలియజేశారు. మహిళలు శక్తి వాట్సప్ నంబర్ కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుంటాయని చెప్పారు. 24/7 శక్తి వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. డయల్ – 112, 181, 1098, 1930 నెంబర్ల యెక్క ఉపయోగాలు, సోషల్ మీడియా ప్రభావం, చదువుకు ఉన్న ప్రాముఖ్యత, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వాడటం వలన ఉపయోగాలు, బాల్యవివాహాలు, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాల గురించి అవగాహన కల్పించారు.


