విమాన ప్రమాదానికి అదే కారణమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : చైనా విమాన ప్రమాదానికి గల కారణం తెలిసిందని చైనా ఏవియేషన్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. బుధవారం విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించడంతో ఆ బాక్స్ డేటా ఆధారంగా వివరాలు సేకరించగా విమానం ధ్వని వేగానికి సమీపంగా ప్రయాణించిందని, అనంతరం వెళ్లి కొండను ఢీకొట్టిందని వారు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ విమాన ప్రమాదం జరిగిన తీవ్రత వల్ల ఆధారాలు లభించడం కష్టం అవుతోంది. అయితే బుధవారం కొనసాగిన గాలింపుల్లో విమానం బ్లాక్ బాక్స్ లభించినట్లు చైనా ఏవియేషన్ అథారిటీ అధికారి ఒకరు పేర్కొన్నారు. విమానం గంటకు 960కి పైగా కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని ఒకానొక సమయంలో 1,000 కిలోమీటర్లకు ప్రయాణ వేగం పెరిగిందని అంటున్నారు.