PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ .. అమెరికాలో రికార్డుల వేట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డుల వేట మొదలెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా గ‌తంలో ఏ భారతీయ చిత్రం విడుదల కాని విధంగా అత్యధిక లొకేషన్స్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సినిమాను విడుదల చేస్తున్న సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా 1150కు పైగా లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాన్న‌ట్టు తెలిపాయి. ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా ఈ మూవీ సుమారు రూ.18కోట్లు పైగా రాబట్టిందని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాయి. దీంతో ‘బహుబలి-2’ 2.4 మిలియన్ డాలర్ల రికార్డును దాటేసింది. యూఎస్‌లో సినీమార్క్ అనే సింగిల్ చైన్ ద్వారానే ప్రీమియర్ ప్రీ సేల్స్‌తో ఏకంగా సుమారు రూ.7.50కోట్లు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.

                                        

About Author