కర్నూలు.. సీఐ కంబగిరి రాముడు సస్పెండ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు అర్బన్ తాలూకా సీఐ కంబగిరి రాముడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఈ నెల 19వ తేదీన సెబ్ తనిఖీల్లో రూ.75 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు తగిన ఆధారాలు చూపినప్పటికి ఎస్పీకి మామూళ్లు ఇవ్వాలంటూ సీఐ కంబగిరి రాముడు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓర్వకల్లుకు చెందిన గౌరీశంకర్ ద్వారా మామూళ్ల వ్యవహారం నడిచింది. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలుకు చెందిన భాస్కర్‌రెడ్డి ఇందుకు సహకరించడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, సీఆర్‌పీసీ 41 నోటీసు జారీ చేసి పంపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. పరారీలో ఉన్న కంబగిరి రాముడి కోసం గాలిస్తున్నారు. సీసీఎస్ సీఐగా ఉన్న శేషయ్యకు కర్నూలు అర్బన్ తాలుకా బాధ్యతలు అప్పగించారు.