జాతరలో డాన్స్ చేసిన మాజీ ముఖ్యమంత్రి !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జాతరలో డాన్స్ చేశారు. మైసూరు జిల్లా సిద్దరామహుండిలో జరుగుతున్న జాతరలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్టెప్పులేశారు. ఆయన సిద్దరామేశ్వర, చిక్కమ్మతాయి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీర మక్కళ కుణిత పాటలకు లయబద్ధంగా అడుగులు వేశారు. గ్రామస్తులతో సరదాగా గడిపారు. ఎమ్మెల్యేగా, సీఎంగా, ప్రతిపక్షనేతగాను గతంలో స్వగ్రామంలోని జాతరలో భాగస్వామ్యులైన ఆయన గురువారం రాత్రి కూడా పాల్గొన్నారు. జాతరకు సంబంధించిన వీడియోలను ఆయన కుమారుడు సోషల్‌మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి.