డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు
1 min readపల్లెవెలుగువెబ్ : డ‌్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని నటి హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు ‘నేను అసలు పబ్‌కు వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చాను.’ అని హేమ మీడియాతో తెలిపారు.