హిజాబ్ వివాదం పై ఆల్ ఖైదా చీఫ్ ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఆల్ ఖైదా చీప్ స్పందించారు. ఇస్లాంపై జరుగుతున్న దాడిపై పోరాడాలని అల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహిరి బుధవారం భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చాడు. మీడియాను ఉపయోగించుకుంటూ, యుద్ధ రంగంలో ఆయుధాలతో తెలివిగా పోరాడాలన్నాడు. జవహిరి వీడియోను అల్ ఖైదా మీడియా మంగళవారం పోస్ట్ చేసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా కొందరు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండగా, ముస్కాన్ ఖాన్ అనే ముస్లిం విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని నినదించడాన్ని జవహిరి ఈ వీడియోలో ప్రశంసించాడు. ఆమె తక్బీర్ నినాదాన్ని సాటిలేని రీతిలో వినిపించిందన్నాడు. హిందూ బహుదేవతారాధకులను ఆమె సవాలు చేసిందన్నాడు. ఆమె నినదించడంతో జీహాద్ స్ఫూర్తి మరింత బలోపేతమైందన్నాడు. ముస్లింలను మేల్కొలిపిందని చెప్పాడు.