NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్ళు

1 min read

జిల్లాలో 2 294 పనులకు రూ. 2014 కోట్లు మంజూరు

రూ.80 వేల కోట్లతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం

ఆ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం

జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

కర్నూలు,  న్యూస్ నేడు: అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.  బుధవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రూ.678.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, రూ. 141 లక్షల రూపాయల వ్యయంతో కర్నూలు – అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారురోడ్డు, రూ. 2250.00 లక్షలు అంచనా వ్యయంతో రెండు వరసల రహదారిగా వెడల్పు చేసి నిర్మించిన  నన్నూరు – చిన్నటేకూరు – కె.నాగలాపురం – గూడూరు – సి. బెలగళ్ – ఎమ్మిగనూరు రోడ్ ప్రారంభం, రూ.40 లక్షల రూపాయల వ్యయంతో ఎన్ హెచ్ 40 నుండి నన్నూరు ఎస్సీ కాలనీ చర్చి వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణం పనులకు   జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,  పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు.

తడకనపల్లి …దేశానికే స్ఫూర్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్తు భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా తడకనపల్లి గ్రామం నిలిచిందని, అటువంటి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి  నిమ్మల రామా నాయుడు.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఒక వైపు అభివృద్ధి, మరోవైపు  సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు…

పారిశ్రామికంగా అభివృద్ధి : ఎంపీ నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ దేశంలో 13 కేంద్రాలు గుర్తిస్తే అందులో ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రం ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు..  రానున్న రోజులలో ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు… గత ప్రభుత్వంలో అభివృధి పనులు ఏమి జరగలేదని, మన ప్రభుత్వం రాగానే అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు…

గుంతలరహిత రాష్ట్రంగా.. ఏపీ  :ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఏపీని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చి వేయడం జరిగిందన్నారు.. పాణ్యం నియోజకవర్గం లో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో  రోడ్లు వేయించడం జరిగిందన్నారు..  మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు..  204 అన్న క్యాంటీన్లు  రన్ అవుతున్నాయన్నారు….ఇచ్చిన హామీ ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేల పెన్షన్ 4 వేల రూపాయలు చేశామని, అదే విధంగా 3 నెలల అరియర్స్ కలిపి మొత్తం 7 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం దే అన్నారు.  కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఏ పిడి రమణ రెడ్డి, సర్పంచ్ షేక్ బీబీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author