చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం !
1 min readపల్లెవెలుగువెబ్ : చంద్రబాబుపై చెత్తవాగుడు వాగే బ్యాచ్‌కి టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేసుకున్నామని.. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్దమని వెల్లడించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్‌పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీనియర్లను కాదని జోగి రమేష్‌కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతలే చెప్పారన్నారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు.