వ్యవసాయం పై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టలేదు !
1 min read

పల్లెవెలుగువెబ్ : రైతులకు భవిష్యత్‌పై భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, రైతుల ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలను వైసీపీ రాజకీయకోణంలో చూస్తోందన్నారు. వ్యవసాయరంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తప్పుబట్టారు. నష్టాలు, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారని తెలిపారు. భూ రికార్డుల్లో పొరపాటు వల్లే రైతు ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆంజనేయలు సమస్యలపై కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా… అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

