అమిత్ షా ఇల్లు కూల్చేయండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఢిల్లీలో అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మీరు బుల్డోజర్లను ఉపయోగించాలనుకుంటే.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్, అమిత్ షా ఇంటిని కూల్చేయండి అంటూ మండిపడ్డారు. అప్పుడు అల్లర్లు ఆగిపోతాయి అంటూ రాఘవ్ చద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్లుగా బీజేపీ పార్టీనే మున్సిపల్ అధికారాన్ని అనుభవించిందని, ఆ సమయంలో అనేక ముడుపులు తీసుకొని, అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిందని తెలిపారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేతల ఇళ్లను కూడా ఇలాగే కూల్చేయాలని చద్దా డిమాండ్ చేశారు.