టమాటా ధరలు పైపైకి.. సిండికేట్ కారణమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పోయిన ఏడాది భారీ వర్షలతో పంట దెబ్బతిని.. ధరలు పెరిగాయి. పది రోజుల కిందట కిలో రూ.20 ఉండగా ఆదివారం నాటికి రూ.60కు చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంతలా ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాము టమాటా పంట పండించిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10వరకు ఉందని, ఇప్పుడు రూ.60కి చేరిన సమయంలో తమ వద్ద పంట లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అవుతుండటం వల్లనే టమాటా పంటకు ధర ఉండటం లేదని, రైతులు వద్ద లేని సమయంలో మంచి ధర ఉంటోందని అంటున్నారు.