‘దేవాదాయ’ కార్యాలయలకు భూమి పూజ…
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు నగర శివార్లలో 1.5 కోట్లతో నిర్మించనున్న దేవాదాయ శాఖ ఉప కమిషనర్ మరియు సహాయ కమీషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల భవనాలకు శుక్రవారం దేవాదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ భూమి పూజ చేశారు. కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, పత్తికొండ శాసన సభ్యులు కంగాటి శ్రీదేవి భూమి పూజకు అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్,అసిస్టెంట్ కమిషనర్లు ఆది శేష నాయుడు, వాణి, రామాంజనేయులు పాల్గొన్నారు.
xxxxxxx