ప్రభుత్వం పై లోక్ సభలో ఆరోపణలు చేసిన ఆర్ఆర్ఆర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై గురువారం లోక్ సభలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. దీంతో ఆయనను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు, రఘురామల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.