ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దక్షిణ ద్వీపకల్ప భారత్ మీదుగా షియర్ జోన్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వర్షాలతో ఎల్లో అలర్ట్ అయింది.