`చేతనైతే నన్ను ఓడించు`.. జగన్ కు బీజేపీ నేత సవాల్ !
1 min read

పల్లెవెలుగువెబ్ : బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెంట్రుక కూడా వైఎస్ జగన్ పీకలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జమ్మలమడుగులో నిర్వహించిన బీజేపీ యువసంఘర్షణ స్కూటర్ ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని.. చేతనైతే అక్కడ నుంచి పోటీ చేసి తనను ఓడించాలని సవాల్ చేసారు. రాష్ట్రానికి జగన్ దరిద్రం పోవాలని వ్యాఖ్యానించారు. తనకు వైఎస్ వివేకా రాజకీయ గురువుగా చెప్పుకొచ్చారు. ఆయన్ను చంపింది ఎవరో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

