టోల్ ప్లాజాలు తొలగిస్తారా ?… పండుగ లాంటి వార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ప్రస్తుతం అమలవుతున్న టోల్ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే విధంగా శరవేగంగా ముందుకెళుతోంది. అందులో భాగంగానే జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత బుధవారం (ఆగస్ట్ 3) స్వయంగా వెల్లడించారు. అసలు ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం ఏంటి.. ఈ విధానం అమలులోకి వస్తే టోల్ ఫీజు చెల్లించేవారికి ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందనే అంశాలపై నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.