మతం మార్చితే పదేళ్ల జైలు శిక్ష !
1 min readపల్లెవెలుగువెబ్ : హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ మతస్వేచ్ఛ(సవరణ) బిల్లు 2022 ను ఏకగ్రీవం ఆమెదించింది. ఈ బిల్లులో సాముహిక మార్పిడిని నిషేధించింది. ఒకరు లేదా అంకంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మార్చుకుంటున్నట్లు పేర్కొంది. బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే సుమారు ఏడేళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కేవలం 18 నెలలు క్రితం అమల్లోకి వచ్చిన హిమచల్‌ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టింది.