NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” ఎన్.సి.డి  3.0  సర్వే పై  లాట్ క్వాలిటీ అసెస్మెంట్”

1 min read

వెల్దుర్తి, న్యూస్​ నేడు:  వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో నాన్ కమ్యునకబుల్ వ్యాధుల 3.0 సర్వే  పై కర్నూలు మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్వాలిటీ అసెస్మెంట్ సర్వేను సామాజిక వైద్యశాస్త్ర విభాగాధిపథి  ప్రొఫెసర్ సుధా కుమారి, ప్రొఫెసర్ సింథియా శుభప్రద లు తనిఖీ చేశారు. క్వాలిటీ అసెస్మెంట్ జరుగుతున్న తీరును పరిశీలించారు. బి.పి, షుగర్,ఎత్తు,బరువు, చుట్టూకొలత ఎలా తీస్తున్నారు.. కాన్సర్ స్క్రీనింగ్ మొదలగు అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ క్వాలిటీ అసెస్మెంట్ సర్వేను బుక్కాపురం గ్రామంలో ఎస్.పి.యం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ పీజీలు పదిమంది ఇంటర్నెస్ వైద్య బృందంచే సర్వే నిర్వహించడం జరుగుతున్నది.ఈ సర్వేలో అసోసియేట్ ప్రొఫెసర్  డా. అరుణ, డిసియస్ డా. రాధ,అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వెంకటేశ్వర్లు, రామళ్లకోట వైద్యాధికారి డాక్టర్ భువన్ తేజ, పి.జి. సబిహా, లెక్చరర్ సురేష్ కుమార్, ఎంపిహెచ్ఇఓ సత్యం, సూపర్వైజర్ మోహన్, అనమ్మ, ఎమ్ఎల్ హెచ్ పి  కాళావతి, ఏఎన్ఎమ్ పద్మాబాయి,ఆశా శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author