పెప్సీ, కోకోకోలాకు పోటీగా `కాంపా కోలా` !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది.