డ్రస్సు విప్పే హక్కు కూడ ఉంటుందనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించే హక్కుపై సుప్రీంకోర్టులో బుధవారం వాదోపవాదనలు సమయంలో జస్టిస్ హేమంత్ గుప్తా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించే హక్కుపై వాదిస్తున్న లాయర్‌ను ఉద్దేశించి….”ఈ అంశాన్ని మీరు ఒక అశాస్త్రీయమైన ముగింపు వైపు తీసుకెళ్లకూడదు. డ్రస్ వేసుకునే హక్కు ఉందంటే డ్రస్ విప్పేసే హక్కు కూడా ఉంటుందనా?” అని ప్రశ్నించారు. దీనికి దేవ్ దత్ కామత్ వెంటనే స్పందించారు. ”పాఠశాలలో ఎవరూ కూడా బట్టలు విప్పరు” అని ఆయన సమాధానమిచ్చారు.