ఒక్క సంవత్సరంలోనే 500 కోట్ల మందులు మింగేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : 2019లోనే భారతీయులు 500 కోట్ల యాంటీబయాటిక్ గోలీలను మింగేశారని లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే జర్నల్ చెబుతోంది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఆ ఏడాది పరిశోధకులు జరిపిన అధ్యయనంలో భారతీయుల యాంటీ బయాటిక్స్ వినియోగం తీవ్రస్థాయిలో ఉంది. వీటిలో అజిత్రోమైసిన్ అగ్రస్థానంలో ఉంది. చాలా దేశాల్లో వైద్యుల సిఫారసు లేకుండా ఔషధాలను విక్రయించరు. భారత్‌లో మాత్రం ఔషధ దుకాణాల్లో సాధారణ పౌరులే తమకు కావాల్సిన ఔషధాలను కొనుగోలు చేసే సౌలభ్యం ఉంది. దీని అరికట్టేందుకు కొత్త నిబంధనలను తీసుకురావడమే కాక, ఉన్న మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తమ నివేదికలో స్పష్టం చేశారు.