వెనుకంజలో మమత బెనర్జీ
1 min readపల్లెవెలుగు వెబ్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. టీఎంసీ నుంచి ముఖ్యమంత్రి మమత బెనర్జీ , బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీ పడుతున్నారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నువ్వా.. నేనా అన్నట్టు తలపడుతున్నారు. ఆసక్తికరంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెనకంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 7వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. సువేందు అధికారి మమత బెనర్జీ నమ్మిన బంటు. అయితే.. సువేందు అధికారి టీఎంసీ వదిలి ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.