ఆధిక్యంలో తండ్రీకొడుకులు
1 min read

పల్లెవెలుగు వెబ్: తమిళనాడు ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. అధికార ఏఐడీఎంకే కంటే ప్రతిపక్ష డీఎంకే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఏఐఏడీఎంకే 61 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తనయిడు , సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడ చేపక్ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కోయంబత్తూరు దక్షిణం నుంచి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

