శిశు ఆధార్ నమోదుకు.. ట్యాబ్ పంపిణీ : డీఎంహెచ్ఓ
1 min read– డాక్టర్ బి.రామగిడ్డయ్య
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరం,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రామగిడ్డయ్య ఆధ్వర్యంలో శిశు ఆదార్ ( Enrollment ID ) నమోదు కొరకు ” ట్యాబ్ లు పంపిణీ చేశారు. శనివారం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 3,ఆదోని ఎం సి హెచ్ ఆసుపత్రికి 3, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి 2 పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బి. రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి శిశువు వివరాలను ట్యాబ్లో నమోదదు చేయాలని, దీనికొరకు తల్లి లేదా తండ్రి మొబైల్ తో లింక్ కాబడిన ఆధార్ నంబర్ మరియు శిశు జనన వివరాలను ట్యాబ్ నందు పొందుపరచినచో శిశువు ఆదార్ ( Enrollment ID ) జనరేట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ రెండు,మూడు రోజులలో మూడు ఆసుపత్రులలో అందుబాటులోనికి వస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో హేమసుందరం,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అసిస్టెంట్ ( బర్త్స్ & డెత్స్ ) విజయలక్ష్మి , డిప్యూటీ ఎస్ ఓ సునీల్, తదితరులు పాల్గొన్నారు.