27న ‘ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్’ వజ్రోత్సవాలు
1 min readఎల్.కె. చిన్నప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పల్లెవెలుగువెబ్: ఉద్యోగ భద్రత.. చెప్పుకోదగ్గ జీతం… లేని ఎయిడెడ్ సిబ్బంది సంక్షేమం…అభ్యన్నతే ధ్యేయంగా 1947లో కీ.శే. కె.వి. అయ్యర్, కీ.శే. ఎండి ఖాసిం, బాలచంద్ర డి.పాండే లాంటి మహనీయులు ఎయిడెడ్ మరియు ప్రైవేట్ స్రూల్స్ టీచర్స్ గిల్డ్‌ను స్థాపించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మహానుభావులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.కె. చిన్నప్ప. ఈనెల 27న విజయవాడలోని గవర్నర్‌పేట, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీటీజీ 75వ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, ప్రత్యేక గౌరవ అతిథులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పతారెడ్డి, ఏపీజీఈఎఫ్ మరియు ఏపీ సెక్రటేరిట్ అధ్యక్షులు కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవ అతిథులుగా మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పి.సుధాకర్ రెడ్డి,,పి. సుబ్బారెడ్డి, పూల రవీంద్ర, గాదె శ్రీనివాసులు నాయుడు, బచ్చల పుల్లయ్య, ఏఎస్ రామకృష్ణ, తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, ఏపీఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విచ్చేస్తున్నారని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీటీజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.కె. చిన్నప్ప వెల్లడించారు.