ఎన్ ఆర్ జి ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లతో రివ్యూ మీటింగ్..
1 min readపల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఏలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీవో పాటి కిషోర్ కుమార్ అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేశారు,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో రోడ్ల పక్కన చెట్లు నాటడం జరగాలని,హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా 90 రోజుల పరిధిలో కల్పించాలని,జాబ్ కార్డులకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయాలని, అదే విధంగా కొత్త పనులు గుర్తించాలని గ్రామపంచాయతీ రికార్డ్స్ నిర్వహణ సక్రమంగా ఉండాలని ఏ పీ ఓ కిషోర్ కుమార్ సూచించారు,ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ కుమార్,ఈసీ రమేష్ , బిఎఫ్ టి లు వజ్రాలత,నాగలక్ష్మి , సి ఓ రత్నకుమారి సిబ్బంది పాల్గొన్నారు.