నూతన ప్రమాణ స్వీకారం…
1 min read– బీసీ, మైనార్టీల వాటాను జనరల్ కు కేటాయించడం నిచం, దుర్మార్గం డా.ఆకుమళ్ళ.నాని
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: (ఘంటసాల శాల గ్రామంలో శ్రీ సత్య సాయి సేవా సమితి నందు అవనిగడ్డ నియోజకవర్గ కృష్ణా జిల్లా నూతన యం. బి. సి. కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల యం.బి.సి. గౌరవ అధ్యక్షులు డా. అకుమళ్ళ.నాని హాజరైన కమిటీ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది జిల్లా ఉాధ్యక్షుడు గా షేక్. అనీఫ్,ప్రమాణ స్వీకారం చేసి డా. అకుమళ్ల. నాని చేతుల మీదగా నియమాక పత్రం అందుకోవడం జరిగింది అవనిగడ్డ నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్. అక్బర్, ఉపాధ్యక్షులు, నవీన్, అరిఫ్, జాకీర్ హుస్సేన్లు , గౌరవ అధ్యక్షులు గా షేక్. షరీఫ్, మిగిలిన కమిటీ సభ్యులందరూ కలసి ప్రమాణ స్వీకారం చేసి డా. అకుమల్ల. నాని చెతుల మీదగా నియామక పత్రాలు అంధుకొన్నారు తదనంతరం కమిటీ సభ్యులు అందురు కలసి డా. ఆకుమళ్ళ. నాని, ని తాటి కొండ రంగ బాబులని జిల్లా కమిటీ పెద్దని ఘనంగా సన్మానించారు. తదనంత రం ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు సేవ రత్న డా.ఆకుమళ్ళ నాని మాట్లాడుతూ బీ.సి. మైనారిటీ “కుల ఆధారిత జనగణన జరగాల్సిందే అనే ప్రజల భావనను అణచడానికి ప్రయత్నించడం కేవలం జన ఆగ్రహాన్ని స్వాగతించడమే” “ఓసీల వాటాను ఓసీలకు భద్రపరిచి, బీసీ, మైనార్టీల వాటాను జనరల్ కు కేటా యించడం దుర్మార్గం, నీచం” ఎందుకంటే స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులకు విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వలన, కులాల మధ్య వివక్షత, అంటరానితనం, సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర అసమానతలు ఉండటం వలన ఈ వర్గాలు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు తను రాసిన రాజ్యాంగం నందు నేరుగా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల తోపాటు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి, మిగతా బీసీ, మైనార్టీలకు 340 ఆర్టికల్ ద్వారా కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు వీటిని కల్పించాలని రాయడం జరిగింది.ఈ రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు వచ్చిన మార్కులు కంటే పేద అగ్రకులాలవారు అని చెపుతున్న వారి మార్కులు తక్కువగా ఉండి అమలు అవుతున్నాయి. ఇప్పుడు అగ్రకులాలవారు చెపుతున్న ప్రతిభ ఎక్కడ దాక్కుందో చెప్పాలి,అలాగే దేశం, రాష్ట్రం అభివృద్ధి ఎంత కుంటుపడిందో, ఎంత నాశనమైందో కూడా చెప్పాలి. నిజంగా అగ్రకుల పార్టీలు సమర్థవంతంగా పాలన చేసి ఉంటే 72 సంవత్సరముల తర్వాత పేద అగ్రకులాల పేరుతో 10శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలి,దీనివలన దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండి ప్రపంచంలో ఇతర దేశాలతో అభివృద్ధిపై మరింత పోటి పడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంత కాలం అగ్రకులాల వారు పన్నిన కుట్రలు, కుతంత్రాలు సభ్యసమాజానికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులకు సుస్పష్టమైంది. ఇక దీనిని ఎవరు మభ్యపెట్టలేరు. కనుక మా జనాభా ఎంతో మాకు లెక్కలు చూపి మా వాటా మాకు పంచాలి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం “బీసీ కుల జనగణన” చేయాలి. లేకపోతే వీటిని సాధించుకోవటానికి ఎం.బీ.సి.లు మైనారిటిలందురు ఉభయ రాష్ట్రాల వారీగా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేయడం జరిగుతుందనీ డా.ఆకుమళ్ళ నాని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పెంటర్ అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాటి కొండ రంగ బాబు, జిల్లా యం. బీ. సి. సలహాధారులు చేబ్రోలు రవీంద్ర నాథ్ టాగూర్, వర్కింగ్ ప్రెసడెంట్ షేక్ సలీం, జిల్లా ఉాధ్యక్షుడు పులి మద్ది మస్తాన్, జిల్లా మహిళా ఉాధ్యక్షులు షేక్. పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.