PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల స్థాయి యస్ జీ యఫ్ క్రీడల సెలెక్షన్స్

1 min read

– మండల స్థాయి సెలెక్షన్స్ ను విజయవంతం చేయండి: ఇంఛార్జి శ్రీనాథ్.
పల్లెవెలుగు. వెబ్​ నందికొట్కూరు: నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశాల మేరకు నందికొట్కూరు మండలంలోని అన్ని మేనేజ్మెంట్ ల పాఠశాలల అండర్ – 17 , అండర్ – 14 బాల,బాలికల కు 09 ఈవెంట్ లలో కబడ్డీ, ఖో- ఖో, వాలీబాల్, టెన్ని కాయిట్, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, షటిల్ బ్యాడ్మింటన్, యోగ ,అథ్లెటిక్స్ లలో సెలెక్షన్స్ ను మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొణిదెల నందు ఈ నెల 18 మరియు 19 తేదీలలో నిర్వహిస్తున్నామని మండల స్థాయి క్రీడా ఇంఛార్జి శ్రీనాథ్ తెలియజేశారు. సెలెక్షన్స్ నిర్వహణ కొరకు మండలం లోని వ్యాయమ ఉపాధ్యాయులతో సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఈ క్రీడలలో పాల్గొనబోయే విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం వారు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారని తెలియజేశారు.కావున నందికొట్కూరు మండల పరిధిలోని అన్ని పాఠశాలల మేనేజ్మెంట్ల వ్యాయామ ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఉదయం 09:00 గంటలకంతా సెలెక్షన్స్ కు తీసుకుని రావాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరక్టర్లు డోరతి,అరుణ,వీరన్న, సుంకన్న, లక్ష్మయ్య , రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author