ఎల్ బాలమ్మ మరణం తీరని లోటు..
1 min read– రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ సంతాపం
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : నిగర్వి,కష్టజీవి,సంఘసేవకురాలు,విశ్రాంత అధ్యాపకురాలు ఎల్. బాలమ్మ మరణం తీరని లోటని ఆమె మరణం పట్ల రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తరుపున సంతాపం తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించారు.మూడు దశాబ్దాలుగా సెయింట్ థెరిసా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి విశేష సేవలు అందించటమే కాకుండా కళాశాల ఎన్.ఎస్.ఎస్.విభాగానికి దీర్ఘకాలం భాద్యతలు తీసుకొని అనేక ప్రాంతాలలో వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందించటం జరిగిందన్నారు,అక్షరాస్యత పెంచటం,ముఖ్యంగా పేదవారికి, వికలాంగులకు,ఎయిడ్స్ బాధితులకు సేవలు సహాయం అందించడంలో ముందుండేవారు. వృత్తికి,ప్రవృత్తికి కొలమానంగా సేవలందించిన మానవతావాది ఎల్.బాలమ్మ ని పలువురు అధ్యాపకులు కొనియాడారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి,జిల్లా అధికారుల నుండి ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పలు అవార్డులు,ప్రశంసలు పొందారన్నారు,సంతాపం తెలిపిన వారిలో యూనిట్ అద్యక్షులు షేక్ హుస్సేన్,కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరావు,ఉపాద్యక్షులు డాక్టర్ పి.సుబ్బలక్ష్మి,కోశాధికారి పి.ఆంజనేయులు,జిల్లా నాయుకులు ఎన్.సి.డేనియల్, డాక్టర్ ఏ.ఉత్తమదుర్గ ఉన్నారు.