PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు.. ప్రజల నుండి విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : మండలంలో ఇల్లూరు కొత్తపేట బనగానపల్లె ఎంపీడీవో శివరామయ్య ఆధ్వర్యంలో మూడవరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి బనగానపల్లె మండలం లో ఇల్లూరు కొత్తపేట సర్పంచ్ రమణస్వాగతం పలికారు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం ప్రజలు కు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో చాలా సంతోషకరంగా ఉన్నారని ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారు అనటానికి ఈ కార్యక్రమమే నిదర్శనం అన్నారు గతంలో ఎలక్షన్ల సమయంలోనే నాయకులు ప్రజల వద్దకు వచ్చేవారని ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసం వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు ప్రతి గడప తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వారికి బనగానపల్లె నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎంపీడీవో శివరామయ్య ఎస్సై రామ్ రెడ్డి గ్రామ సర్పంచ్ రమణ చాంద్ బాషా వార్డ్ నెంబర్లు కౌన్సిలర్ వాలంటరీ వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author