నలుగురి ప్రాణాలు కాపాడిన తాలుకా ఎస్సై షమీర్ భాషా
1 min read– ఎస్సై షమీర్ భాషా ను ప్రత్యేకంగా అభినందించిన…జిల్లా ఎస్పీ
– శభాష్ అంటున్న నెటిజన్స్.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధి బాలాజీ నగర్ లోని కేశవ రెడ్డి స్కూల్ సమీపంలో ఒక ఇంటిలో (నాయక్ నర్సి w/o. చంద్రూజి , డోర్ నెంబర్ – 3/139 , బాలాజీ నగర్ , కర్నూలు. ) 4 గురు వ్యక్తులు సెంట్రింగ్ మరియు ప్లంబింగ్ పని చేస్తుండగా పై కప్పు కూలి పడిపోవడంతో ఇరుక్కుపోయారు. ఈ ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్ లో నలుగురు కార్మికులు కలిసి సెంట్రింగ్ పని చేయడానికి ఇనుప రాడ్ల ను బిగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 గురు కార్మికులు ఇరుక్కుపోయారు. వీరందరూ 40 సంవత్సరాలు పైబడిన వారే. పై కప్పు కూలి ప్రమాదంలో చిక్కుకున్న వారు.ప్లంబర్లు…1) మద్దిలేటి (కర్నూలు టౌన్ – రైల్వేస్టేషన్ దగ్గర)2) చిన్న ( కర్నూలు టౌన్ – రైల్వేస్టేషన్ దగ్గర) గౌండాలు…3) ఫక్కీర ( పోలుకల్లు – సి.బెళగల్ మండలం)4 రాఘవేంద్ర (వెల్ధుర్తి )పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు తాలుకా ఎస్సై షమీర్ భాషా గారు సకాలంలో స్పందించి వీరి ప్రాణాలు కాపాడి నెటిజెన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు.ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి షమీర్ భాషా ఎస్సై గారు 108 అంబులెన్స్ ను పిలిపించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు, ఇతర పోలీసు అధికారులు ఎస్సై షమీర్ భాషా ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో హ్యట్సాఫ్ టూ ఎస్సై అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.