గైనిక్ వైద్యులపై డా.నరేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
1 min readపల్లెవెలుగు , వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పలు విభాగాల రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని గైనిక్ ఓపి విభాగం నందు వైద్యులు మరియు సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రిలోని రౌండ్స్ నిర్వహించే సమయంలో గైనిక్ విభాగం నందు సందర్శించి అనంతరం అక్కడున్న పేషంట్లతో ఆరా తీయగా 11 గంటల వరకే ఓపిలను ఇవ్వడం ఆపేస్తున్నట్లు తెలుసుకున్నారు అనంతరం ఇకపై నుంచి ఓపి టికెట్స్ 1PM ఒంటిగంట వరకు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.ప్రతిరోజు ఓపి విభాగాల్లో మధ్యాహ్నం 2PM రెండు గంటల వరకు ఓపి విభాగంలో డాక్టర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గైనిక్ వైద్యులు లేకపోవడంపై వారికి మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు గైనిక్ (ఫిఫ్త్ యూనిట్) ఓపీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్, గైనిక్ PGS, లేకపోవడం పై విచారణకు ఆదేశించారు.ఆసుపత్రిలోని ప్రతిరోజు ఓపిలకు పేషెంట్లు వస్తుంటారు వారికి ఇబ్బంది కలగకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని లేనియెడల వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము సిబ్బంది హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO,డా.వెంకటేశ్వరరావు, మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారని, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.