సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన కృష్ణబిలం
1 min readపల్లెవెలుగువెబ్ : కనీసం కాంతిని కూడా చొరబడనివ్వని అంతరిక్ష అగాథాలు కృష్ణబిలాలు. వీటినే బ్లాక్ హోల్స్ అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని కనుగొన్నారు. భూమికి అత్యంత చేరువలో ఉన్న కృష్ణబిలం ఇదే. ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దది. ఒఫియకస్ నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు వెల్లడైంది. ఇంతక్రితం కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని భావిస్తున్న పరిశోధకులు, అసాధారణ అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.