మాదాసి,మాదారి కురువలను ‘ఎస్సీ’లో చేర్చొద్దు..
1 min readజీఓనం 53ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: మాదాసి, మాదారి కురువలను ఎస్సీ జాబితాలో చేరుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంఎస్నం.53ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు దండు వీరయ్య. శనివారం కర్నూలులోని అంబేద్కర్ భవన్ నందు సుభాకర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా దండు వీరయ్య, జయరాజు (అడ్వకేట్), వైసీపీ నాయకులు మద్దయ్య , టీడీపీ నాయకులు జేమ్స్ , కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కరుణాకర్ కర్నూలు జిల్లా INTUC అధ్యక్షులు బతుకన్న, INTUC అధికార ప్రతినిధి సుంకన్న, MRPS నాయకులు సోమసుందర్ , ఉద్యోగ సంఘం AP S.C welfare Association state vice president G. నాగరాజు D.E.E , మద్దూరి.వెంకటస్వామి M&H dept, అడ్వకేట్ చంద్రుడు , వివిధ S.C సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాసి, మాధారీ కురువ కులాలను S.C కులాల జాబితాలో నుంచి ఉపసంహరించుకునేంత వరకు వివిధ రూపాలలో రాష్ట్ర,జిల్లా ల వ్యాప్తంగా AP S.C కులాల రిజర్వేషన్ పరిరక్షణ పోరాట సమితి( JAC) ఏర్పాటు చేసి పోరాటము చేయాలని పిలుపునిచ్చారు.