జీ తెలుగులో… 14 నుంచి ‘త్రి నయని’
1 min readపల్లెవెలుగు వెబ్: జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్‌లో అందరికి ఇష్టమైనది, అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్ త్రినయని. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన త్రినయని సీరియల్ రాబోయే ఎపిసోడ్స్‌లో మరింత యాక్షన్-ప్యాక్డ్ కంటెంట్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 14 నుంచి ప్రసారమయ్యే ఎపిసోడ్స్ లో ట్విస్ట్‌లు, కథని మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఆడియన్స్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. త్రినయని సీరియల్ రాబోయే యాక్షన్-ప్యాక్డ్ ఎపిసోడ్‌లలో అత్యంత విలువైన నాగమణిని తిరిగి పొందేందుకు నయని తన ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. మరోవైపు కాశీ మరియు వల్లభ మధ్య ఏదో జరుగుతుందని విశాల్ గమనిస్తాడు. దీంతోపాటు విలువైన మరియు శక్తిమంతమైన ఆ నాగమణి అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని కనుక్కోవాలని తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. మరోవైపు నాగుల చవితి నాడు నయని పూజ చేసేందుకు సిద్ధమవుతుంది. అక్కడకు సుమన మరియు ఆమె కుటుంబం కూడా వచ్చి నయనని చూస్తుంది. మరోవైపు పూజ చేస్తూనే నాగమణి ఎక్కడ ఉందా అని వెతుకుతూనే ఉంటుంది నయని. నాగమణి జాడ తెలుసుకునేందుకు ప్రమాదకరమైన పాము గుహలోకి కూడా వెళ్తుంది. అక్కడే ఆమె తనకు సంబంధించిన ఒక కీలకమైన నిజాన్ని తెలుసుకుంటుంది. మరి ఆ నిజం ఏంటి.? అనేది తెలియాలంటే త్రినయని సీరియల్ రాబోయే ఎపిసోడ్స్‌ని మిస్ కాకుండా చూడాల్సిందే. నాగమణిని నయని సంపాదిస్తుందా? ఆమె తెలుసుకునే ఆ షాకింగ్ నిజం ఏమిటి? ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే అద్భుతమైన కంటెంట్‌తో సిద్ధమైన త్రినయని రాబోయే ఎపిసోడ్స్‌ని అస్సలు మిస్ కావొద్దు.
త్రినయని సీరియల్.. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు… మీ జీ తెలుగులో …