ఆర్ఆర్ఆర్ 2 పై రాజమౌళి ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : గతంలో బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువచ్చిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో ఏంచేయనున్నారన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా చిత్రాలన్నింటికీ మా నాన్నే కథలు సమకూర్చుతారు. ఆర్ఆర్ఆర్-2 గురించి ఇటీవల కొద్దిగా చర్చించాం. ఇప్పుడాయన ఆ స్టోరీపై కసరత్తులు చేస్తున్నారు” అని వివరించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై రాజమౌళి గతంలోనూ సానుకూలంగా స్పందించారు. “ఒకవేళ సీక్వెల్ సాధ్యమైతే ఎంతో సంతోషిస్తాను. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని కాదు… నా సోదరులు (ఎన్టీఆర్, రామ్ చరణ్)లతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇదే నన్ను మరింత ఉత్సాహపరిచే అంశం. అయితే ఈ ప్రాజెక్టును కాలమే నిర్ణయించాలి” అని జక్కన్న పేర్కొన్నారు.