PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరులో ఆవులకు సోకిన లంపి వైరస్…

1 min read

ఆవులను రోడ్లపైకి వదిలేసిన  యజమానులు..

భయాందోళన చెందుతున్న పట్టణ ప్రజలు..

మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి.

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు:కరోనా వైరస్ తర్వాత లంపీ వైరస్ విలయతాండవం చేస్తోంది . అయితే లంపి వైరస్‌ వినాశనం మనుషుల్లో కాదు జంతువులలో ఉంది. ఈ వైరస్‌కు ఎక్కువ ప్రభావితమైనవి పశువులు. వాటిలో ఎక్కువగా  ఆవులు కూడా ఉన్నాయి.నందికొట్కూరు మున్సిపాలిటీ లో లంపి వైరస్ బారిన పడిన పశువుల సంఖ్య 10  చేరుకుందని సమాచారం. లంపి వైరస్ భారిన పడిన ఆవులను యజమానులు రోడ్డున వదిలేస్తున్నారు. రోగాల బారిన పడిన గోవులు పట్టణంలోని పలు కాలనీలో తిరుగుతుండడం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వ్యాధి లక్షణాలు..: జంతువులు ఈ వైరస్ బారిన పడినప్పుడు, శరీరంలో చాలా గడ్డలు ఏర్పడతాయి. ఇది కాకుండా, బరువు తగ్గడం, నోటి నుండి ద్రవం రావడం, జ్వరం, జంతువులలో పాలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కాకుండా ఈ వైరస్‌ కారణంగా ఆడ జంతువులలో వంధ్యత్వం, అబార్షన్, న్యుమోనియా వంటి సమస్యలను కూడా వస్తాయంటున్నారు పశువైద్య నిపుణులు.

ఈ వైరస్ దేని వల్ల వ్యాపిస్తుంది?: ఈ వైరస్ దోమ, మొక్కజొన్న, పేను, కందిరీగ వల్ల వస్తుందని చెబుతున్నారు. దీనితో పాటు, వ్యాధి పశువులకు మురికి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుందంటున్నారు.వాస్తవానికి లంపీ స్కిన్ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే రకం కాదని వైద్యులు చెబుతున్నారు.

అధికారులు  చర్యలు తీసుకోవాలి..:లంపి వైరస్ సోకిన పశువులు, ఆవులను వాటి యజమానులు  విచ్చలవిడిగా రోడ్లపై వదిలిపెట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గోవులను గోశాలలకు తరలించి పశువైద్యాధికారులు చికిత్స అందించాలి.ఆవులు  వీధులలో తిరగడం వలన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని  భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి వైరస్ సోకిన ఆవులను రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

About Author