2022 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ- 2 ’
1 min read– నవంబర్ 20 ఆదివారం సాయంత్రం 6 గం.లకు మీ జీ తెలుగులో
పల్లెవెలుగు వెబ్: జీ తెలుగు అంటేనే నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్కు కేర్ఆఫ్ అడ్రస్. సరికొత్త సినిమాలు, ఆకట్టుకునే సీరియల్స్‌తో ప్రతీవారం తెలుగు లోగిళ్లలో వినోదాన్ని అందిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్‌హిట్ సినిమాల్ని అందించిన జీ తెలుగు… ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కార్తికేయ 2ని ప్రసారం చేయబోతోంది. మైథలాజికల్ యాక్షన్ అడ్వంచర్ మూవీగా రూపొందిన కార్తికేయ- 2 ఈ ఆదివారం, అంటే నవంబరు 20, 2022 సాయంత్రం 6 గం.లకు జీ తెలుగులో ప్రసారం కానుంది .ఎప్పటిలాగే ఈసినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో చేస్తుంది మన జీ తెలుగు ఇందులో భాగంగా ఖమ్మం లోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లోదాదాపు 2000 లకు పైగా స్టూడెంట్స్ తోమానవహారంగా ఏర్పడి అతిపెద్ద శ్రీ కృష్ణుడి బొమ్మను సృష్టించారు. ఇందులో హీరోగా నిఖిల్ సిద్ధార్ధ్, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇతర పాత్రల్లో అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, హర్ష, ఆదిత్య మీనన్ మెప్పించారు.