ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో సంక్రాంతి సంబరాలు
1 min read– భారతీయుల సంస్కృతికి సాంప్రదాయానికి నిర్వచనం సంక్రాంతి పండుగ..
– నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా ఏలూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ భారత సంస్కృతి ఉట్టిపడేలా హిందువులకు అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలను తెలుగు వారి సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా నిర్వహించిన మెప్మా సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తొలుత భోగి మంటలు వెలిగించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు,ఆర్పీలు సి ఓ లు స్వయం సహాయక సంఘ గ్రూపు సభ్యులు వేసిన రంగురంగుల రంగవల్లులు ఎంతగానో ఆకర్షించాయి, ఇళ్ల దగ్గర తయారు చేసుకొచ్చిన వివిధ రకాల పిండి వంటలు ప్రదర్శించి అనంతరం అందరూ ఆరగించారు.చిన్నారులు చేసిన జానపద,భరతనాట్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ముగ్గుల పోటీలు,నృత్య ప్రదర్శనలు, పిండి వంటకాలు.చేసిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎఫ్ పట్టణ అధ్యక్షులు లక్ష్మి శారద మెప్మా పిడి ఇమ్మానియేల్,అసిస్టెంట్ కమిషనర్ చోడే బాపిరాజు ,పిఓ కృష్ణమూర్తి, మున్సిపల్ ఆర్వోలు కే శోభ, అరుణ, మెప్మా సిబ్బంది,సి ఓ లు, ఆర్పీలు స్వయం సహాయక గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.