NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 లీటర్ల నాటు సారా స్వాదీనం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్  మరియు వారి సిబ్బంది కాల్వ గ్రామం లో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా, గుడుంబాయి తాండ కు చెందిన మాలవత్ ధను నాయక్ ను సిబ్బంది పట్టుకొనేందుకు ప్రయత్నించగా బైక్, సారాయి వదిలి పారిపోయినాడు. హీరో హోండా మోటార్ సైకిల్ మరియు 40 లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని,  సదరు పారిపోయిన మగ వ్యక్తి పై  కేసును నమోదు చేశాము అని త్వరలోనే పట్టుకుంటాము అని కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. మరియొక్క కేసులో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్  మరియు సిబ్బంది కలిసి గుమ్మితం తాండ గ్రామం నందు ధాడులు జరుపగా చెందిన వార్తే వీరంజనేయ నాయక్  అను వ్యక్తి  వద్ద 15  లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని,  సదరు వ్యక్తి ని  అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్  సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు మరియు కానిస్టేబుల్ సిబ్బంది మురహరి రాజు, మధు, రామలింగయ్య, ఈరన్న  మరియు చంద్రపాల్ పాల్గొన్నారు అని తెలిపినారు.

About Author