ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షలకు పెంచాలి
1 min read– సీపీఐ పోరుబాటను జయప్రదం చేయండి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగనన్న ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం రూ.5లక్షల కు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సిపిఐ పోరుబాటను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాంమూర్తి తెలియజేశారు. శుక్రవారం స్థానిక నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఇల్లు పేరుతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే జగనన్న కాలనీల పేరుతో నిర్మాణానికి అవసరమైన మౌళిక సదుపాయాలను ఏమాత్రం కల్పించలేదన్నాని ఆరోపించారు. లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్ ,ఇటుకలు, ఇసుక ,కంకర కిటికీలు, తలుపులు ,ధరలు పెరగడంతో కూలీల ధరలు కూడా బాగా పెరిగాయని పెరిగిన ధరలకు అనుగుణంగా జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష ఏనాభై వేలు ఏమాత్రం సరిపోవటం లేదని రూ. 5 లక్షల ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు . ఈనెల 17 నుంచి 30 వరకు లబ్ధిదారులతో సంతకాల సేకరణ చేపట్టి 30న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, ఫిబ్రవరి 6న కలెక్టర్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాలో లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు ఏఐటీయూసీ పట్టణ నాయకులు రాజు ,రాము ,ప్రతాప్ ,మధు తదితరులు పాల్గొన్నారు.